BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 09:44 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పురిటిబిడ్డ మృతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Sep, 2026 - 09:44 AM
25 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, మదనపల్లె:

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం వేకువజామున పురిటిబిడ్డ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పుంగనూరు పట్టణానికి చెందిన సాదిక్ భాషా భార్య సుమియా సుల్తానా రెండు రోజుల క్రితం పురిటి నొప్పులతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.

డెలివరీ ఆలస్యం కావడంతో ఆసుపత్రిలో నీటి కొరత ఉందని, స్నానం చేసేందుకు స్థానిక సిబ్బంది సూచన మేరకు గురువారం బసినికొండలోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్నానం అనంతరం అదే రోజు రాత్రి 10.30 గంటలకు తిరిగి ఆసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు.

అనంతరం వైద్యులు పరీక్షలు నిర్వహించారని, సాధారణ ప్రసవ సమయంలో బిడ్డ తల ముందుగా రావాల్సి ఉండగా పేగు ముందుగా రావడంతో పరిస్థితి విషమించి బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, వైద్యపరమైన కారణాలపై ఆసుపత్రి అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గమనిక: బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలను అధికారిక నిర్ధారణగా కాకుండా వారి వాంగ్మూలంగా మాత్రమే పేర్కొన్నాం.