పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు
తెలంగాణ
/
హైదరాబాద్
వరంగల్ | ఎన్ టుడే న్యూస్:
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6వ తేదీలోగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి బి. చంద్రశేఖర్ సూచించారు.
పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇప్పటివరకు అందిన 3,26,669 దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలతో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన పట్టభద్రుల పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.