BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 16 August 2026, 04:58 pm
Posted by : కూనురు మధు

పాపన్న గౌడ్ జయంతికి భారీగా తరలిరావాలి

తెలంగాణ
/ హైదరాబాద్
16 Aug, 2026 - 04:58 PM
161 వీక్షణలు

పాపన్న గౌడ్ జయంతికి భారీగా తరలిరావాలి: గౌడ జేఏసీ పిలుపు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఈనెల 18న ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బహుజనులు తరలిరావాలని అంబర్‌పేట్ అసెంబ్లీ గౌడ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ (కోరంటి) చౌరస్తాలో ఆదివారం గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. 

అలాగే గ్రేటర్ హైదరాబాద్ యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, సురేష్ యాదవ్, గంగపుత్ర సంఘం చైర్మన్ ధర్మేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈనెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన వేడుకలకు భారీ సంఖ్యలో బహుజనులు హాజరయ్యేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. ప్రతి గ్రామం నుంచి వందలాది మంది బహుజనులు హైదరాబాద్‌కు తరలిరావాలని, ఉదయం 10 గంటలలోపు తమ ప్రాంతాల్లోని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మధ్యాహ్నం 3 గంటలలోపు ట్యాంక్‌బండ్‌కు చేరుకునేలా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసి పాపన్న గౌడ్ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ జేఏసీ కన్వీనర్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్‌తో పాటు గౌడ సంఘం నాయకులు పల్లె వెంకట్ గౌడ్, యల్మకంటి మీరయ్య గౌడ్, రాఘవేంద్ర గౌడ్, హిమగిరి గౌడ్, వెంకటేష్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.