BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 01 April 2026, 07:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పేదల గుండెల్లో నమ్మకం నింపుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Apr, 2026 - 07:12 PM
200 వీక్షణలు

పేదల గుండెల్లో నమ్మకం నింపుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ – మోరంపూడి శ్రీనివాసరావు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం నిజమైన ఆర్థిక అండగా నిలుస్తోందని తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

బుధవారం ఉదయం చాట్రాయి మండలం చనుబండ, సూరంపాలెం గ్రామాల్లో జరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. సచివాలయ సిబ్బందితో కలిసి మోరంపూడి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పేదల పక్కనే ప్రభుత్వం… ప్రతి ఇంటికి భరోసా” అనే నినాదం మరోసారి ఈ కార్యక్రమంతో సార్థకం అయిందని మోరంపూడి అన్నారు 

హృదయాన్ని కదిలించిన ఘటనలో భాగంగా, చనుబండ గ్రామానికి చెందిన పింఛనుదారుడు కొట్టే పేతురు ఇటీవల మృతిచెందగా, ప్రభుత్వం స్పందించి నెలలోపే స్పౌజ్ పింఛన్ మంజూరు చేసి, ఆయన భార్య కొట్టే కాంతమ్మకు పింఛన్ అందజేయడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ప్రభుత్వం పేదల పట్ల చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని స్థానికులు ప్రశంసించారు.

చనుబండ గ్రామంలో కూడా పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రజలతో మమేకమైన మోరంపూడి, కూటమి ప్రభుత్వం సంక్షేమం – అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో చీదిరాల మారేశ్వరరావు, నక్కా రాము, గుడిమళ్ళ బ్రహ్మయ్య, పరసా శ్రీను, గవర వెంకటేశ్వరరావు, జక్కం కాంతారావు, కొట్టే దేవదాసు, భారత వెంకటేశ్వరరావు, బన్నే రామకృష్ణతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.