BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 02 July 2026, 12:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పేదల సంక్షేమమే ధ్యేయం.. ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 12:24 AM
125 వీక్షణలు

నూజివీడు నియోజకవర్గంలో పేదల సంక్షేమం, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

బుధవారం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో "పేదల సేవలో" కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి శ్రీనివాసరావుతో పాటు 3వ బూత్ కన్వీనర్ పరసా శ్రీను పాల్గొని సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సొమ్ముతో పేద కుటుంబాలు ఆర్థికంగా భరోసా పొందుతూ ధీమాగా జీవిస్తున్నాయని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వీఆర్‌వో శోభన్‌బాబు, పరసా శ్రీను, బన్నే వెంకటేశ్వరరావు, బన్నే గోపాలకృష్ణ, కడగంచు మహేష్ తదితరులు పాల్గొన్నారు.