BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పేదవాడి సొంతింటి కల సాకారం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
19 Mar, 2026 - 06:13 PM
339 వీక్షణలు

పేదవాడి సొంతింటి కల సాకారం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం  

సామూహిక గృహప్రవేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  ముఖ్య అతిథిగా  పాల్గొని, లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి విజయం

​గృహప్రవేశం చేసిన లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే ఈ పథకం విజయానికి నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.​సామాజిక సమానత్వం పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కేవలం గూడు కల్పించడం మాత్రమే కాదు, అది సామాజిక సమానత్వానికి మరియు గ్రామీణ అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు.

 ప్రతి అర్హులైన నిరుపేదకు సొంత ఇల్లు అందే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. కొత్త ఇళ్లలోకి చేరుతున్న వేళ లబ్ధిదారుల ఇళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తమ కల నిజం చేసినందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి  ​"సొంతిల్లు అనేది మా జీవితకాల స్వప్నం. ఇన్నాళ్లకు ఇందిరమ్మ పథకం ద్వారా మా ఆశ నెరవేరింది" అని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, చిట్యాల ఇన్చార్జ్ ఎంఆర్ఓ విజయలక్ష్మి , ఎంపీడీవో, జయలక్ష్మి వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. అధికారుల సమన్వయంతో నాణ్యతతో కూడిన గృహాల నిర్మాణం పూర్తి చేయడం పట్ల కలెక్టర్ అధికారులను అభినందించారు.