BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 29 May 2026, 11:25 pm
Posted by : BATHULA VENKATESH

పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
29 May, 2026 - 11:25 PM
214 వీక్షణలు

ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం.        ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రత్యేక మొమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన ఫలితాలు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి పల్లా సూర్య నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ, టీడీపి నాయకులు బత్తుల రమణ, కన్నారావు,చిరంజీవి జనసేన గ్రామ అధ్యక్షులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దేవర సత్యనారాయణ గారు మాత్లాడుతు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషితో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థకు కొత్త దిశ లభించిందని పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, సాంకేతికత ఆధారిత విద్యా విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాల వైపు దూసుకెళ్తున్నాయని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయిలో ప్రతిభ కనబరుస్తుండటం ఆనందదాయకమని, భవిష్యత్తులో విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు..