BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 11:57 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి దాశరథి 101వ జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 11:57 AM
119 వీక్షణలు

పెనుగొలనులో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి దాశరథి 101వ జయంతి వేడుకలు ఘనంగా

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్యులు 101వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. దాశరథి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దాశరథి కృష్ణమాచార్యులు 1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరు మండలం మర్రిపాడులో జన్మించారని తెలిపారు. తెలుగు సాహిత్యంలో ఖండకావ్యాలు, కథలు, నాటికలు, కవితలు, గేయాలు, సినీగీతాలు, అనువాదాలు వంటి అనేక ప్రక్రియల్లో విశిష్ట సేవలందించారని కొనియాడారు.

కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలుచుకుని ప్రజల్లో చైతన్యం నింపిన మహాకవి దాశరథి అని పేర్కొన్నారు. 1977 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆస్థాన కవిగా సేవలందించారని గుర్తు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, కళా ప్రపూర్ణ, కవి సింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి, ఆంధ్ర కవితా సారధి వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, బిరుదులు ఆయనకు లభించాయని వివరించారు.

కార్యక్రమంలో నామా రవి, ఆళ్ళ మురళి, శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని దాశరథికి ఘనంగా నివాళులర్పించారు.