BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 30 May 2026, 02:22 pm
Posted by : కూనురు మధు

పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 May, 2026 - 02:22 PM
212 వీక్షణలు

పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో సెంటర్‌లో శనివారం అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది ప్రతి ఇంటింటికీ తిరుగుతూ, బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల బాలురు, బాలికలందరినీ తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నాణ్యమైన బోధన అందిస్తున్నామని, అలాగే పౌష్టికాహారాన్ని కూడా సమకూరుస్తున్నామని వివరించారు. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు అని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు దాడి అరుణ, ఎన్. అపర్ణ, డి. జ్యోతి, బుజ్జమ్మ, కృష్ణవేణి, శోభారాణి, మమత, అలాగే తల్లిదండ్రుల తరపున కిషోర్ మరియు స్థానిక బాలురు, బాలికలు, మహిళలు పాల్గొన్నారు.