BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 31 August 2026, 08:12 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

విద్యార్థులకు వేద గణితంపై అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్ జాతీయం
31 Aug, 2026 - 08:12 PM
53 వీక్షణలు

పల్నాడు జిల్లా, నరసరావుపేట: నరసరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వేద గణితంపై ఒకరోజు అవగాహన సదస్సును నిర్వహించారు.

గణితం అంటే విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి, సులభమైన పద్ధతుల్లో గణిత సమస్యలను పరిష్కరించే విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు, పోటీ పరీక్షలకు అవసరమైన గణిత అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.

ఈ సదస్సుకు ప్రముఖ వేద గణిత నిపుణుడు ఆర్. గురు ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. సాధారణ పద్ధతులతో పోలిస్తే వేద గణితంలోని సులభమైన సూత్రాలు, పద్ధతులను ఉపయోగించడం ద్వారా లెక్కలను వేగంగా, కచ్చితంగా పూర్తి చేయవచ్చని వివరించారు.

పోటీ పరీక్షల్లో సమయపాలన, వేగం, కచ్చితత్వం ఎంతో ముఖ్యమని, వేద గణిత పద్ధతులు విద్యార్థులకు ఈ అంశాల్లో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు గణితాన్ని కష్టమైన సబ్జెక్ట్‌గా భావించకుండా ఆసక్తితో నేర్చుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పలు గణిత సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించి చూపిస్తూ, వాటిని సులభంగా ఎలా సాధించవచ్చో వివరించారు. విద్యార్థులు సదస్సులో ఉత్సాహంగా పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర, కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.