BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 06:44 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరంలో నాటు సారా తయారీకి సిద్ధం చేసిన 50 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 06:44 AM
25 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న “నవోదయం 2.0” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ దాడుల్లో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 50 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి సంఘటనా స్థలంలోనే ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలవరం గ్రామానికి చెందిన కలవకొల్లు రెడ్డయ్యపై కేసు నమోదు చేసినట్లు నూజివీడు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.

ఏలూరు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నూజివీడు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు, నిల్వలు, బెల్ట్ దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నాటు సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊటను భూముల్లో నిల్వ ఉంచే భూ యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉన్న ప్రజలు 9440902462 నంబర్‌కు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.