BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 27 March 2026, 07:09 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రేమించి పెళ్ళి చేసుకున్న నా భార్యను ఓ సీఐ దూరం చేశాడు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Mar, 2026 - 07:09 PM
145 వీక్షణలు

నా భార్యను నాకు అప్పగించి, సీఐపై చర్యలు తీసుకోవాలి

 ఓ యువకుడు అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

ప్రియురాలిని సంక్షేమ గృహానికి తరలించి.. సీఐపై విచారణ చేపట్టండి..

అడిషనల్ ఎస్పీ ఆదేసించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లె : ఏడేళ్ళుగా ప్రేమించుకున్నాం. పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నాం. అమ్మాయి వర్గం మిస్సింగ్ అంటూ బి.కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల తర్వాత అనగా బుధవారం రాత్రి ఇరువురు కలసి బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్ సీఐ వద్దకు వెళ్ళడం జరిగింది. ఇరువర్గాలతో ఏలాంటి విచారణ చేయకుండా.. నా భార్య హారికను సీఐ వారి తల్లిదండ్రులు అప్పగించి.. వెంటపెట్టి పంపించేశారు. ఇదేమని అడిగితే.. ఎక్కువ మాట్లాడితే కేసులు బుక్ చేసి జైల్లో పెడుతానంటూ బి.కొత్తకోట సీఐ దౌర్జన్యం, బెదిరింపులకు గురిచేశారు. నా భార్యను నాకు అప్పగించాలని అడిగితే.. పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్ నుంచీ బయటకు పంపించేశారని.. బాధితుడు గురువారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లి పంచాయతీ బూడిదగడ్డపల్లికి చెందిన ముక్కండ్ల ఉత్తన్న చిన్న కుమారుడు వినోద్‌కుమార్ ఇంటర్‌ వరకు చదువుకొని మోల్డింగ్ కమ్మి బెండింగ్ పనులు చేసుకుంటున్నాడు. బి.కొత్తకోట మండలంలో ఇంటర్ చదువుతున్న సమయంలో.. బి.కొత్తకొట మండలం సూరపువారిపల్లి పంచాయతీ దయ్యాలచారిపల్లికి చెందిన హారికతో పరిచయమైంది. గత ఏడేళ్ళుగా ఇరువురు ప్రేమించు కుంటున్నాము. కులాలు వేరు కావడంతో హారిక తల్లిదండ్రుల అభ్యంతరం చేశారు. ఏడాది క్రితమే వినోద్‌కుమార్, హారికలు ఇంటి‌ నుంచీ వెళ్ళిపోయారు. అందరి సమక్షంలో పెళ్ళి చేస్తామని హామీ ఇచ్చి వేరు చేశారు. అయితే హారికకు పెళ్ళి సంబంధాలు చూస్తుండటంతో గత నెల 25న ఇద్దరు ఇంటి నుంచీ వెళ్ళిపోగా.. మరలా పిలిపించి పోలీసులు, పెద్దలు కలసి పంచాయతీ చేశారు. అయితే పదిరోజుల కితం ప్రేమికులు ఇరువురూ.. ఇంటినుంచీ వెళ్ళిపోయి.. ఒరిస్సాలో పేట గ్రామంలోని అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నారు. వారంరోజుల తర్వాత హారిక మొబైల్ లొకేష్ ఆధారంగా బి.కొత్తకోట పోలీసులు ఫోన్ చేసి పోలీస్ స్టేషనుకు రమ్మన్నారు. నిన్నటిరోజు అనగా బుధవారం రాత్రి 7.30గంటలకు బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రేమికులు ఇరువురూ మేజర్లు. అయినా ప్రేమించి పెళ్ళి చేసుకున్న హారికను ఏలాంటి విచారణ చేయకుండానే సీఐ వారి తల్లిదండ్రులకు అప్పగించి పంపించి వేయడంపై అబ్బాయి తరపున బంధువులు సీఐని నిలదీశారు. ఎవరైనా మాట్లాడితే కేసులు నమోదు చేస్తామని సీఐ బెదిరింపులు చేస్తూ.. బయటకు పంపించేశారంటూ బాధితుని బంధువులు, కుటుంబసభ్యులు సీఐపై తిరుగు బావుటా చేశారు. బాధితుడు వినోద్‌కుమార్ నా భార్యను నాకు అప్పగించి సీఐపై చర్యలు తీసుకోవాలని గురువారం మదనపల్లెలోని అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బి.కొత్తకోట సీఐపై విచారణకు ఆదేశిస్తూ.. జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి అడిషనల్ ఎస్పీకి ఆదేశించారు.