BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 10:04 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో ప్రైవేట్ పాఠశాల బస్సుల తనిఖీలు నిర్వహించిన ఎంవీఐ సుప్రియ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 10:04 PM
93 వీక్షణలు

NTODAY NEWS:- అన్నమయ్య జిల్లా, పుంగనూరు: పాఠశాలల సెలవుల నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాలను పరిశీలించేందుకు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) సుప్రియ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంవీఐ సుప్రియ మాట్లాడుతూ, పాఠశాల బస్సులు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా ఫిట్‌గా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించినట్లు తెలిపారు. బస్సుల డాక్యుమెంట్లు, ఎమర్జెన్సీ డోర్లు, విండోలు, చిన్నారులు సురక్షితంగా ఎక్కేందుకు అవసరమైన మెట్లు తదితర అంశాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.

ప్రతి స్కూల్ బస్సులో ఫైర్ డిటెక్షన్ మరియు ఆటోమేటిక్ అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అలాగే బస్సు డ్రైవర్లకు కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలని, డ్రైవర్‌తో పాటు ఒక అటెండర్‌ను కూడా నియమించాలని ఆదేశించారు.

బస్సుల నాలుగు వైపులా పాఠశాల పేరు, ఫోన్ నంబర్ స్టిక్కర్ల రూపంలో కాకుండా శాశ్వతంగా పెయింట్ చేయించాలని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు.

విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యమని, అన్ని ప్రైవేట్ పాఠశాలలు రవాణా శాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎంవీఐ సుప్రియ స్పష్టం చేశారు.