BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 17 June 2026, 03:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజుల మోత..? తల్లిదండ్రుల ఆవేదన – విద్యాశాఖపై ప్రశ్నల వర్షం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 03:36 PM
113 వీక్షణలు

ఏలూరు జిల్లా లోని చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, చాట్రాయి మండలాల్లో పలు ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఫీజులు, పుస్తకాల ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఈ ఫీజుల భారం తీవ్రంగా పడుతోందని వారు పేర్కొంటున్నారు. తమ సమస్యలను పట్టించుకునే అధికారులు లేరా అనే ప్రశ్నను కూడా తల్లిదండ్రులు మీడియా ఎదుట వ్యక్తం చేశారు.

పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత కూడా ఒక్క ప్రైవేట్ స్కూల్‌ను కూడా విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పర్యవేక్షణ పూర్తిగా లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరగాలని ప్రభుత్వ స్థాయిలో సూచనలు ఉన్నప్పటికీ, ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం నిబంధనల అమలు లోపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తరగతి గదులు, ఆటస్థలాలు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేకపోయినా అనుమతులు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

బస్సుల్లో అనుమతించిన సంఖ్యకంటే ఎక్కువగా విద్యార్థులను ఎక్కించుకోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలల్లో వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పుడు తల్లిదండ్రులను మాత్రమే సంప్రదిస్తున్నారని, తక్షణ వైద్య సహాయం అందడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఫీజుల నియంత్రణపై అధికారులు తక్షణం దృష్టి సారించి, నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ ఆరోపణలపై ఇప్పటివరకు సంబంధిత ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు లేదా విద్యాశాఖ అధికారుల నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.