BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 19 June 2026, 05:34 pm
Posted by : RAMU JAJU

ప్రభుత్వ బడి బలోపేతానికి అన్నారం గ్రామం వినూత్న నిర్ణయం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
19 Jun, 2026 - 05:34 PM
220 వీక్షణలు

ప్రైవేట్ పాఠశాలల్లో గ్రామ పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వొద్దని వినతి

ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ప్రారంభం నేపథ్యంలో గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం

డొంకేశ్వర్, జూన్ 19 (ఎన్‌టుడే న్యూస్): ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామం ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అన్నారం ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ (ఎల్‌కేజీ, యూకేజీ) తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామంలోని చిన్నారులందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) మరియు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ నిర్ణయానికి అనుగుణంగా శుక్రవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు డొంకేశ్వర్‌లోని ఫ్రోబెల్ స్కూల్, ఎస్‌.ఎస్‌.వి. స్కూల్ యాజమాన్యాలను కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్నారం గ్రామానికి చెందిన విద్యార్థులకు కొత్తగా అడ్మిషన్లు కల్పించవద్దని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని వారు స్కూల్ యాజమాన్యాలను కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామంలోని ప్రతి చిన్నారి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు సహకరించాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం అన్నారం గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.