BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 April 2026, 05:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 05:38 PM
255 వీక్షణలు

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య:  తిరువూరు నియోజకవర్గం - విస్సన్నపేట మండలం:

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని ఎంపీపీఎస్ నరసాపురం మెయిన్ పాఠశాలలో "బడిబాట" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఉదయం 7 గంటలకే పాఠశాల టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించి, వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని ఒప్పించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన విస్సన్నపేట మండల విద్యాశాఖ అధికారి 1 కే శంకరరావు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందులో 'వందనం' కార్యక్రమం, 'విద్యార్థిమిత్ర కిట్', 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం', 'డిజిటల్ విద్యాబోధన' మరియు 'ట్రాన్స్పోర్ట్ అలవెన్స్' వంటి పథకాలు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు."

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జయరావు, కే. అనురాధ, పి. మారేశ్వరి, సీఆర్పి రత్నం, ఎస్ ఎంసీ చైర్మన్ నాగ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.