BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 09:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రియుడితో కలిసి తాత హత్యకు మనవరాలి కుట్ర..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:40 PM
85 వీక్షణలు

ప్రియుడితో కలిసి తాత హత్యకు మనవరాలి కుట్ర.. వీడియో కాల్‌లో ప్రత్యక్షంగా వీక్షణ

కేరళలో సంచలనం సృష్టించిన దారుణ ఘటన.. ఐదుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తిరువనంతపురం/అలప్పుజ: కన్న కూతురిలా చూసుకోవాల్సిన మనవరాలే తాత హత్యకు కుట్ర పన్నిన ఘటన కేరళలో సంచలనం రేపింది. 13 ఏళ్ల బాలిక తన 17 ఏళ్ల ప్రియుడితో పాటు మరో ముగ్గురు మైనర్ల సహకారంతో 67 ఏళ్ల తాతను హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య జరుగుతున్న సమయంలో బాలిక వీడియో కాల్‌లో ప్రత్యక్షంగా వీక్షించినట్లు దర్యాప్తులో తేలింది.

అలప్పుజలో జరిగిన ఈ ఘటనలో.. వృద్ధుడి భార్య చిన్న కుమార్తె ప్రసవం కోసం ఆసుపత్రిలో ఉండటంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితులు పథకం అమలు చేశారు. ఆగస్టు 15 రాత్రి బాలిక ప్రియుడితో పాటు మరో ముగ్గురు బాలురు ఇంటికి చేరుకుని బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా లోపలికి ప్రవేశించారు.

వృద్ధుడి చేతులు, కాళ్లు కట్టి.. నోటిలో గుడ్డలు కుక్కి.. తలను గోడకు బలంగా కొట్టి.. అనంతరం ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ దారుణాన్ని బాలిక వీడియో కాల్ ద్వారా చూస్తూ సూచనలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 4.5 కాసుల బంగారాన్ని తీసుకుని నిందితులు పరారయ్యారు.

మరుసటి రోజు ఏమీ తెలియనట్లు నటించిన బాలిక.. సమీపంలోని దుకాణానికి వెళ్లి చిప్స్ కొనుగోలు చేసింది. తాత తలుపు తీయడం లేదని, బహుశా మద్యం తాగి నిద్రపోతున్నారని చెప్పింది. అంతేకాకుండా తాత మృతి చెందిన విషయం తెలిసినా పాఠశాలకు వెళ్లేందుకు యూనిఫాం ధరించి సిద్ధమైంది.

బంధువులు అనుమానంతో తలుపులు తెరిచి చూడగా వృద్ధుడు హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత దొంగతనం కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలతో అసలు విషయం బయటపెట్టారు.

బాలికతో పాటు ఆమె ప్రియుడు, మరో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాత తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే కక్ష పెంచుకున్నట్లు బాలిక చెప్పినప్పటికీ.. డబ్బు కోసం కూడా ఈ కుట్ర జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మొబైల్ ఫోన్ కొనుగోలు, బైక్ కొనుగోలు కోరికలు కూడా కారణాలుగా ఉండవచ్చని తెలిపారు.

మైనర్లను జువెనైల్ హోమ్‌కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. పెద్దల తరహాలో విచారణకు జువెనైల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. విషాదకరంగా అదే సమయంలో వృద్ధుడి చిన్న కుమార్తె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్త మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రి మార్చురీకి రావాల్సిన పరిస్థితి ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.