BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 03:30 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక',

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
08 Jun, 2026 - 03:30 PM
102 వీక్షణలు

ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', 'రెవెన్యూ క్లినిక్'

పల్నాడు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులంతా పాల్గొనే ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ పూర్తి వివరాలు, గత రసీదులతో వినతులు సమర్పించాలన్నారు. ఈ సేవలు మండల, మున్సిపల్ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంటాయని, ప్రజలు 1100 కాల్ సెంటర్ లేదా meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

మరోవైపు, భూసంబంధిత సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లు తమ రికార్డులతో ఈ క్లినిక్‌కు హాజరై అర్జీలను స్వీకరిస్తారని, రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.