BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 10 June 2026, 01:45 pm
Posted by : V శ్రీనివాస్

​ప్రజలు హక్కుల కోసం పోరాడాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తెలంగాణ
/ హైదరాబాద్ / హిమాయత్‌నగర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 01:45 PM
328 వీక్షణలు

ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు: ఓటు హక్కుతోనే వ్యవస్థ బలోపేతం

​హైదరాబాద్: ప్రజలు తమ హక్కుల కోసం మాట్లాడకపోతే, వాటిని కాపాడుకునేందుకు ముందుకు రాకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. దేశంలో జరుగుతున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, రూపాయి విలువ క్షీణత, యువత భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలు దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

​ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చని ఆయన అన్నారు. ప్రజలు గట్టిగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడితేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొంటూ.. "జై హింద్, జై భీమ్, జై కాన్స్టిట్యూషన్" అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు.