BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 05 August 2026, 06:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 06:02 AM
98 వీక్షణలు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

ముంబై, ఆగస్టు 5: బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో విలక్షణ ప్రతినాయకుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం కన్నుమూశారు. రక్తం గడ్డకట్టడం (బ్లడ్ క్లాట్) కారణంగా తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

బాలీవుడ్‌లో లగాన్ చిత్రంతో గుర్తింపు పొందిన ప్రదీప్ రావత్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం ఛత్రపతి చిత్రంలో పోషించిన ప్రతినాయకుడి పాత్రతో విశేష ఆదరణ పొందారు. తన గంభీరమైన నటనతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో 70కి పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

తెలుగులో ఆయన చివరిసారిగా గాయపడ్డ సింహం చిత్రంలో నటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.

వ్యక్తిగత జీవితంలో తన ఏకైక కుమారుడిని హీరోగా చూడాలన్న కోరికతో ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులను, అభిమానులను విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.