BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 25 April 2026, 05:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తిరువూరులో అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Apr, 2026 - 05:51 PM
121 వీక్షణలు

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తిరువూరులో అవగాహన కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు:

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని, తిరువూరు పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ రేష్మా బేగం ఆధ్వర్యంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మలేరియా, డయేరియా వంటి వ్యాధులను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. డాక్టర్ రేష్మా బేగం, దోమల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

ముఖ్యంగా, ఇంటి చుట్టూ మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడటం, చెట్లు, పొదలు అధికంగా పెరగకుండా శుభ్రపరచడం అనివార్యమని ఆమె తెలిపారు. పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని, అవసరమైతే పంచాయతీ శాఖ సహాయం తీసుకోవాలని ఆమె చెప్పారు.

ఆషా వర్కర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటిని క్రమం తప్పకుండా సందర్శించి, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.