BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 16 August 2026, 08:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రతి సోమవారం జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో ప్రజావాణి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 08:04 PM
76 వీక్షణలు

మండల స్థాయిలోనే ప్రజల సమస్యల స్వీకరణకు చర్యలు

ఖమ్మం, ఆగస్టు 16:

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే వినతులు స్వీకరించి పరిష్కరించే ఉద్దేశంతో ప్రతి సోమవారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు.

ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రజావాణితో పాటు ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మండల కేంద్రాల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ సమస్యలు, వినతులు, దరఖాస్తులను మండల స్థాయిలోనే సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు.

మండల స్థాయిలో స్వీకరించిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.