BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 23 July 2026, 08:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు రూ.71 వేల నగదు పురస్కారాలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 08:29 PM
91 వీక్షణలు

ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు రూ.71 వేల నగదు పురస్కారాలు

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎనిమిది మంది విద్యార్థులకు గురువారం దాతల సహకారంతో రూ.71 వేల నగదు పురస్కారాలు అందజేశారు.

దాతల్లో సివిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చెరుకూరి వెంకటేశ్వరరావు రూ.50 వేల, యరమల ఆనందరెడ్డి రూ.6 వేల, వూట్ల సీతయ్య రూ.5 వేల, తోటమాల ఎఫ్రైమ్ రూ.5 వేల, సూరిశెట్టి బ్రదర్స్ రూ.5 వేల చొప్పున అందించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట నరసింహారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న మధిర మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో మరింత కృషి చేసి ఉన్నత ఫలితాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సివి రావు, పంగా శేషగిరి, వార్డు కౌన్సిలర్లు పిల్లి సునీత, వేమిరెడ్డి లక్ష్మీ తులసి, శ్రీశైలం నర్సిరెడ్డి, పిల్లి మోజస్, రేగండ్ల సాంబశివరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.