BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 16 June 2026, 11:02 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం_రక్తదాన శిబిరం ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 11:02 AM
94 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తం లేక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో, రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ రక్తదాన శిబిరంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్, రక్తనిధి ఇంచార్జి దిలీప్ కుమార్, మరియు నరసింహులు,పాల్గొన్నారు. వీరితో పాటు మదనపల్లి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కూడా పాల్గొని, రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించడంలో కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్  మాట్లాడుతూ... రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

రక్తనిధి ఇంచార్జి దిలీప్ కుమార్ మరియు నరసింహులు  మాట్లాడుతూ... పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో అత్యవసర సమయాల్లో రక్తం కొరత లేకుండా చూసేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ శిబిరంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువకులను, దాతలను ఆసుపత్రి సిబ్బంది అభినందించి, వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన మోహన్ రెడ్డి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ జ్యూస్, పండ్లు బిస్కెట్ ప్యాకెట్ ను ఆయన సొంత డబ్బుతో ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.