BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 08:20 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్వోల నిరసన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 08:20 PM
87 వీక్షణలు

NTODAY NEWS అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపుమేరకు వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్వో అక్బర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వెంకయ్యపాలెంకు చెందిన వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ అధిక పని భారం, అలాగే  పై అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. వీఆర్వోలపై రోజురోజుకు పనిభారం పెరుగుతోందని దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్వోల సమస్యలను పరిష్కరించడంతో పాటు అదనపు పని భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని వీఆర్వో అక్బర్  డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మూడు రోజులపాటు నిరసనలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సుబ్రమణి, కేశవులు, రెడ్డమ్మ, రత్నప్ప, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.