BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 21 February 2026, 10:55 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పెద్దమ్మతల్లి ఆలయ చోరీ కేసు ఛేదనం

తెలంగాణ
21 Feb, 2026 - 10:55 AM
422 వీక్షణలు
పెద్దమ్మతల్లి ఆలయ చోరీ కేసు ఛేదనం నిందితుడు అరెస్ట్ – మరిన్ని దొంగతనాలు ఒప్పుకున్న దొంగ NTODAY NEWS: రిపోర్టర్ శ్రీనివాస్, మంచిర్యాల మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ, పోచమ్మ చెరువు కట్టపై ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆలయ తలుపులు పగులగొట్టి హుండీతో పాటు ఆభరణాలు, చీరలను అపహరించిన ఘటనలో నిందితుడు గుమ్మడి సారయ్యను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడ్డ దుండగులు హుండీని పగులగొట్టి నగదు మరియు ఇతర వస్తువులను దోచుకెళ్లారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు పెద్దమ్మతల్లి ఆలయ హుండీ నుండి సుమారు రూ.3,000 అపహరించినట్లు గుర్తించారు. విచారణలో భాగంగా ఈ నెల 19న ఒక హనుమాన్ ఆలయంలో రూ.5,000 దొంగతనం చేసినట్లు, అలాగే గతంలో ఎంసీసీ పోస్టాఫీస్‌లో జరిగిన చోరీ ఘటనలో కూడా తన ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నాడు. గతంలోనూ ఈ ప్రాంతంలో చోరీలు చోటుచేసుకున్న నేపథ్యంలో, రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ను పెంచాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. #Mancherial #TempleTheft #CrimeNews #TelanganaPolice Follow us on Website Facebook Instagram YouTube