BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 19 September 2025, 08:13 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయాలు తగదు

తెలంగాణ
19 Sep, 2025 - 08:13 PM
409 వీక్షణలు
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయాలు తగదు-- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 7 ప్రకారం అర్హత ఉన్న నిరుపేదలైన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఇవ్వాలని,ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో రాజకీయాలు తగవని,ఇప్పటికైనా ఇండ్లు కావలసిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున స్థానిక బొమ్మలరామారం మండలంలో సిపిఎం పార్టీ మండల గ్రామ కమిటీ సమావేశం ముద్దం వసుంధర రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా శ్రీశైలం పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాకుండా సంక్షేమ పథకాలను అర్హత కలిగిన వారందరికీ అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కొక్క గ్రామంలో నిజమైన లబ్ధిదారులను పదుల సంఖ్యలో తొలగిస్తున్నారని శ్రీశైలం ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాలలో నిజమైన లబ్ధిదారులను మరో మారు గ్రామ సభలు పెట్టి అందరి సమక్షంలో ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కాంగ్రెస్ గ్రామ కమిటీలుగా మారాయని అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చూడాలని గ్రామాల అభివృద్ధిల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో ప్రజలందరినీ అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి అందరి సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తేనే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా అర్హత కలిగిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇవ్వకపోతే మండల వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలను సమీకరించి గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు ఆందోళన చేపడుతామని శ్రీశైలం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సాయి, పున్నమ్మ, వెంకటేష్, బ్రహ్మచారి, రవి, మధు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube