BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 23 December 2025, 12:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జనవాణి కార్యక్రమంలో సమస్యల వెల్లువ

తెలంగాణ
23 Dec, 2025 - 12:49 AM
202 వీక్షణలు

జనవాణి కార్యక్రమంలో సమస్యల వెల్లువ

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ ర్రాఘవేంద్ర రాజు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కాంపౌండ్ వాల్, తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి పుంగనూరు, చిత్తూరు జిల్లా: పుంగనూరు పట్టణంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారుల దృష్టిని ఆకర్షించారు. కళాశాల ప్రాంగణానికి ఇప్పటివరకు కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల ఆక్రమణలు, అతిక్రమణలు మరియు బయటి వ్యక్తుల జోక్యం పెరిగి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని విన్నవించారు. 1983లో 14.5 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడిన ఈ కళాశాలకు ఇప్పటికీ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరగకపోవడం విచారకరమని తెలిపారు. కాంపౌండ్ వాల్ లేకపోవడం కారణంగా రాత్రి సమయాల్లో కళాశాల ప్రాంగణం సంఘ వ్యతిరేక శక్తుల అడ్డాగా మారుతూ, మద్యం సేవించే వారి సంచారం పెరిగి క్రమశిక్షణ లోపిస్తున్నట్లు పేర్కొన్నారు. కళాశాలలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, పరికరాలు ఉన్నాయని, వాటిని రక్షించేందుకు కాంపౌండ్ వాల్ అత్యవసరమని తెలిపారు. గతంలో పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని వాపోయారు. ఇదే సమయంలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో తరగతి గదుల కొరత తీవ్రమవుతోందని తెలిపారు. అంతేకాకుండా ఇటీవల స్థాపించబడిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు అదే ప్రాంగణంలో నాలుగు గదులు కేటాయించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని పుంగనూరు జనావాని కార్యక్రమంలో పుంగనూరు ఇంచార్జ్ సిరివేలు చిన్నా రాయల్ మరియు పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, కి వినతి పత్రం అందజేశారు. Follow us on Website Facebook Instagram YouTube