BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 20 February 2026, 08:20 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శుక్రవారం సభ ద్వార ప్రజారోగ్య పర్యవేక్షణ

తెలంగాణ
20 Feb, 2026 - 08:20 AM
408 వీక్షణలు
  శుక్రవారం సభ ద్వార ప్రజారోగ్య పర్యవేక్షణ తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి NTODAY NEWS: చొప్పదండి (కరీంనగర్ జిల్లా) అంగన్వాడీ మరియు వైద్య సిబ్బంది సమన్వయంతో నిర్వహిస్తున్న ‘శుక్రవారం సభ’ల ద్వారా జిల్లాలో ప్రజారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం చొప్పదండి మండలం చాకుంట అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముఖ్యాంశాలు తల్లీబిడ్డల ఆరోగ్యం: తల్లి–శిశు పోషణ, ఆరోగ్య పరిరక్షణకు ఈ సభలు వేదికగా మారుతున్నాయని, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని సూచించారు. నెలవారీ నివేదికల సమీక్ష: గ్రామాల వారీగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి నివేదికలు తెప్పించుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. తక్కువ బరువున్న శిశువులపై చర్యలు: పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి, అవసరమైతే NRC (Nutrition Rehabilitation Centre) లో చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఆరోగ్య మహిళ పథకం: సభల ద్వారా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 245 మందికి రెండో విడత స్క్రీనింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులపై సూచన: పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను ప్రతిరోజూ పాఠశాలలకు, ప్రత్యేక తరగతులకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు, శిశువులకు అన్నప్రాసన కార్యక్రమాలు కలెక్టర్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్య అధికారి వెంకటరమణ, సర్పంచ్ పురం మాధవి, ఉపసర్పంచ్ వేముల శేఖర్, సిడిపిఓ నర్సింగారాణి తదితరులు పాల్గొన్నారు. #Karimnagar #Choppadandi #FridaySabha #PublicHealth #PamelaSatpathy #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube