BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 March 2026, 07:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేపు ఏపీలో తీవ్ర వడగాల్పులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Mar, 2026 - 07:34 PM
155 వీక్షణలు

రేపు ఏపీలో తీవ్ర వడగాల్పులు

అమరావతి, మార్చి 26: రాష్ట్రంలో రేపు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని APSDMA హెచ్చరించింది. ఉత్తర ఆంధ్ర, గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉండొచ్చని తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు, కాకినాడ జిల్లాలో జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ, ఎన్టీఆర్ జిల్లాలో జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో తిరగకుండా ఉండాలని, తగినంత నీరు, ద్రవపదార్థాలు తీసుకోవాలని, తలపై గుడ్డ లేదా టోపీ ధరించాలని సూచించారు. చిన్నపిల్లలను ఎండలోకి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.