BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 21 June 2026, 08:01 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి – మెట్రోపై కీలక చర్చలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 08:01 AM
111 వీక్షణలు

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు పెండింగ్ అంశాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు.

ఈ నెల 16న రాసిన లేఖను ప్రస్తావిస్తూ, తాజా లేఖలో ఈ నెల 22, 23 తేదీల్లో తాను ఢిల్లీ పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

హైదరాబాద్ నగరం, తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టుగా మెట్రో రైలు విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఫేజ్–2 విస్తరణకు సంబంధించిన పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా కేంద్రం జోక్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరించనున్నట్లు తెలిపారు. అవసరమైన ఒప్పందాలు, పత్రాల ప్రతులు కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు. సమావేశ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకుని వివరాలు తెలియజేయాలని కోరారు.