BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 23 June 2026, 07:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతు భరోసా నిధుల జమపై కొత్త ట్విస్ట్.. అర్హులకే సాయం!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:36 PM
112 వీక్షణలు

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30 నుంచి రైతు భరోసా నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి దశలవారీ విధానానికి బదులుగా ఒకే విడతలో నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సుమారు 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గత యాసంగి సీజన్‌లో రెండు ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం అందించడంపై విమర్శలు రావడంతో, ఈసారి చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

కీలక మార్పులు ఇవే..

జూన్ 30 నుంచి రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభం.

సుమారు రూ.9 వేల కోట్ల వరకు నిధుల పంపిణీకి ఏర్పాట్లు.

కొత్త పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులను కూడా జాబితాలో చేర్చే అవకాశం.

ఏడున్నర ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించే ప్రతిపాదన పరిశీలనలో.

కేవలం పట్టాదారు పాస్‌బుక్ ఉన్నవారికే కాకుండా, వాస్తవంగా పంట సాగు చేస్తున్న రైతులకే సాయం అందించే దిశగా ప్రభుత్వం ఆలోచన.

శాటిలైట్ సర్వే ఆధారంగా ఎంపిక?

రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు వివరాలను శాటిలైట్ చిత్రాల ద్వారా సేకరించిన ప్రభుత్వం, గ్రామాల వారీగా సాగు విస్తీర్ణాన్ని గుర్తించింది. పైలట్ ప్రాజెక్టులో మంచి ఫలితాలు రావడంతో భవిష్యత్తులో ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఏడున్నర ఎకరాల పరిమితి, శాటిలైట్ సర్వే ఆధారంగా అర్హుల ఎంపిక వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో చివరకు ఎవరెవరికి రైతు భరోసా నిధులు జమ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.