●
మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు
●
అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
●
దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
●
ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం
●
గుంటూరులో ఘోర ప్రమాదం ....
●
డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి
●
బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
●
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
●
కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం
●
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ

రైతు బిడ్డకు అండగా సహకార సంఘం… మానవత్వం చాటిన చనుబండ పీఏసీఎస్
రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కష్టకాలంలో రైతు కుటుంబాలకు అండగా నిలవడం సహకార సంఘాల అసలు ధర్మమని ఆయన పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం గ్రామంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇటీవల కన్నుమూసిన సంఘ సభ్యుడు స్వర్గీయ చిన్నం లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన సంఘం ప్రతినిధులు, వారి దుఃఖంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మట్టిఖర్చుల నిమిత్తం సంఘం తరఫున రూ.10,000 నగదు సహాయాన్ని చైర్మన్, డైరెక్టర్లు, సీఈఓ వెంకటేశ్వరరావు కలిసి అందజేశారు.
“రైతు కుటుంబం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు… సంఘం మీకు అండగా ఉంటుంది” అంటూ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన తీరు అందరినీ కదిలించింది. అంతేకాకుండా, సంఘం ద్వారా లభించే భీమా సొమ్ము కూడా త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గవర వెంకటేశ్వరరావు, కంచు మల్లయ్య, నందిపామ్ ప్రభాకరరావు, బాల్ధ భూషణం, ముద్దుల శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, బన్నే వెంకటేశ్వరరావు తదితరులు, రైతులు, సంఘం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.