BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 23 May 2026, 08:49 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

రైతులు ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
23 May, 2026 - 08:49 AM
193 వీక్షణలు

నాగినేనిపల్లి గ్రామంలో ఉన్న పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తనిఖీ

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్యాయం జరుగుతుందని వచ్చిన ఫిర్యాదు పై స్పందించిన యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో ఉన్న పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను శుక్రవారం రోజున తనిఖీ చేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు కొనుగోలు కేంద్రంలో నాలుగు కాంట మిషన్లు ఉండడం, కాంట మిషన్లో వేరువేరుగా తూకాలు చూపించడంతో కాంటాలు సరిగా పనిచేయడం లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రం లో కాంటాల పరిస్థితిపై సీఈఓ జయేందర్, కొనుగోలు సెంటర్ నిర్వాహకులను వివరణ ఇవ్వాలన్నారు. గ్రామ రైతులు మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యాన్ని మిల్లర్లు తమ స్వార్థం కోసం మా ధాన్యాన్ని బీ గ్రేడ్గా మార్చుతున్నారని, అదనంగా రెండు కిలోల వరకు తూకం వేయడంతో పాటు ధాన్యం బస్తాల్లో మూడు కిలోల వరకు కోత విధిస్తున్నారని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో అదనపు కలెక్టర్ వెంటనే రైస్ మిల్లులపై తగు చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రైతులని ఇబ్బంది పెడితే మిల్లర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు కొనుగోలు  జిల్లాలోనూ ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న కాంటాల పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలట్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చీర సత్యనారయణ,డిసిఎస్ ఓ రోజా రాణి,డిసిఓ మురళి రమణ, మండల తహసిల్దార్ పి. శ్రీనివాసరావు,డిప్యూటీ తాహసిల్దార్ సివిల్ సప్లై నర్సింగరావు, ఏఈఓ మౌనిక, పిఎసిఎస్ సీఈవో జయేందర్, రామిడి జంగారెడ్డి, మల్యాల గ్రామ ఉపసర్పంచ్ మైలారం సుదర్శన్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.