BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

రెవెన్యూ కార్యాలయంలో డబ్బులు ఇస్తేనే పని లేదంటే పని కాదు-

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
23 May, 2026 - 09:04 AM
200 వీక్షణలు

రెవెన్యూ ఆఫీసులో డబ్బులు ఇచ్చినా రైతులకు, ప్రజలకు అధికారులు పని చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని పేదవారికి పని చేయడం లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు శుక్రవారం రోజున బొమ్మలరామారం సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం సల్లూరు కుమార్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి రైతులు తమ భూ సమస్యలు పరిష్కారం చేయమని రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినా కాని పేద రైతుల, ప్రజల సమస్యలు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, డబ్బులు ఉన్న పెద్ద రైతుల ప్రజల సమస్యలు మాత్రమే పట్టించుకోని పనిచేయడం జరుగుతున్నది అని అన్నారు పేద మధ్యతరగతి డబ్బు లేని రైతులు రోజు ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగిన అధికారులు వారి వంక కూడా చూడడం లేదు అని అన్నారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన  ధరణిలో అవినీతి జరిగిందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తీసుకురావడం జరిగింది భూ భారతి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న రైతుల సమస్య ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు దస్తావేజల సమస్య, సాదా బైనామా చిన్నచిన్న తప్పులు కూడా పాసుబుక్కుల్లో ఉంటే వాటిని సరి చేసే పరిస్థితిలో కూడా లేకుండా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు అని అన్నారు భూభారతి పేరుతో ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని అన్నారు బొమ్మలరామారం మండలంలో సమస్యల పరిష్కారం కోసం  రెవెన్యూ ఆఫీసుకు  రోజువారీగా రైతులు వందల మంది వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అని అన్నారు వీటితోపాటు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాల్లో కూడా డబ్బులు ఇస్తేనే అధికారులు పనిచేస్తున్నారు అని అన్నారు డబ్బులు ఇయ్యని పేదలకు పనులు చేయడం లేదు అని అన్నారు ఈ సమస్యను పరిష్కారాలు చేయమని అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో మండలంలోని పేద మధ్యతరగతి రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు లేని యెడల ప్రజలను సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం నాయకులు సాయి, పున్నమ్మ తదితరులు పాల్గొన్నారు