అర్ణబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు
100–120 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్
గంటకు 50–60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు
హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో తేలికపాటి వర్షాలు
హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్:
అర్ణబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి.
వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో సుమారు 30 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఇతర జిల్లాల్లోనూ అక్కడక్కడ వానలు పడవచ్చని అంచనా వేస్తున్నారు.
అక్టోబర్ 30 తర్వాత హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ తాజా సూచనలను గమనించాలని సూచిస్తున్నారు.