BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 17 June 2026, 03:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 03:26 PM
112 వీక్షణలు

 కర్నూలు జిల్లా వెల్దుర్తి మేజర్‌ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ రూ.40 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ప్రకారం వెల్దుర్తికి చెందిన సంజుపోగు సతీశ్‌ తనకు ఉన్న రెండు సెంట్ల స్థలంలో గుడిసె వేసుకున్నాడు. ఆ స్థలానికి కొత్త ఇంటి నంబరు మంజూరు చేయడం, ఇంటి పన్ను నమోదు చేయడం కోసం గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను సంప్రదించాడు.

దీనికి సంబంధించి స్థల అప్రూవల్‌తో పాటు ఇంటి నంబరు మంజూరు చేస్తానని చెప్పిన సెక్రటరీ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం బేరసారాల తర్వాత రూ.45 వేలకు ఒప్పందం కుదిరింది. అందులో ముందుగా రూ.40 వేలు ఇవ్వాలని, పని పూర్తయిన తరువాత మిగతా రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

లంచం ఇవ్వాల్సి రావడంతో బాధితుడు సతీశ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం మంగళవారం డబ్బులు తీసుకుని వెల్దుర్తి గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లాడు. అనంతరం సెక్రటరీ సూచన మేరకు హైవే–44 ఆంజనేయస్వామి కూడలి వద్ద కర్నూలు వైపు ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్లాడు.

అక్కడ ముందుగానే మాటువేసిన ఏసీబీ డీఎస్పీ సోమన్న బృందం, సతీశ్‌ నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటుండగా సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నగదును స్వాధీనం చేసుకుంది.

నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.