హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
హయత్‌నగర్ బస్టాండ్ వద్ద మిత్రుడిని దింపి తిరిగి వెళ్తుండగా ప్రమాదం
సీవీఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్న అభిలాష్
కుమారుడి మృతితో విషాదంలో కుటుంబ సభ్యులు
హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్:
హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి ఏమిరెడ్డి అభిలాష్ రెడ్డి మృతి చెందాడు. లారీ ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
అభిలాష్ రెడ్డి సీవీఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. మిత్రుడిని హయత్‌నగర్ బస్టాండ్ వద్ద దింపి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
అభిలాష్ రెడ్డి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి నల్లగొండ పట్టణంలోని ప్రేరణ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.