BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 07:25 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం బట్టబయలు – 13 సిలిండర్లు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:25 AM
201 వీక్షణలు

సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం బట్టబయలు – 13 సిలిండర్లు స్వాధీనం

వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న అక్రమ వ్యవహారం ఏలూరు జిల్లాలో బయటపడింది. విశ్వసనీయ సమాచారంపై రీజినల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె. నాగేశ్వరరావు ఆదేశాల మేరకు అధికారులు ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలోని ఓంకారేశ్వరి బిర్యానీ హోటల్, శ్రీ విఘ్నేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వీట్ హోమ్, అలాగే భీమడోలు మండలం ఎం.ఎం.పురం గ్రామంలోని సునీల్ కిరాణా షాపు, హాట్ చిప్స్ వద్ద అక్రమంగా గృహ గ్యాస్ సిలిండర్ల వినియోగం గుర్తించారు.

మొత్తం 13 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో యజమానులు వాణిజ్య అవసరాలకు కమర్షియల్ సిలిండర్లకు బదులుగా గృహ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు అంగీకరించారు.

సుమారు రూ.31,079 విలువైన సిలిండర్లను సీజ్ చేసి, సంబంధిత యజమానులపై నిత్యవసర వస్తువుల చట్టం, 1955 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎస్ఐ కె. నాగరాజు, రెవెన్యూ మరియు పౌర సరఫరా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.