BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 12 April 2026, 05:48 pm
Posted by : V శ్రీనివాస్

సీఎంకు దమ్ముంటే సింగరేణి దోపిడీపై 'సిట్' వేయాలి: కేటీఆర్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 05:48 PM
299 వీక్షణలు

​మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇటీవల ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం "దోచుకో-దాచుకో" అనే పథకాన్ని అమలు చేస్తూ అవినీతికి తెరలేపిందని, ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ వసూళ్లలో మునిగిపోయారని నిప్పులు చెరిగారు. క్యాతనపల్లిలో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, అక్రమ కేసులు మరియు పోలీసుల వేధింపులతో భయభ్రాంతులకు గురిచేసినా లొంగకుండా నిలబడిన కౌన్సిలర్ల ధైర్యాన్ని ఆయన కొనియాడారు.

​ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ అక్రమాలపై సీఎంకు దమ్ముంటే 'సిట్' (SIT) విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్టుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డిపై విచారణ జరగాలని, 'సైట్ విజిట్ సర్టిఫికేషన్' పేరుతో జరుగుతున్న దోపిడీపై సీఎం సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. తాము ఏ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేస్తూ.. మెడికల్ బోర్డును వెంటనే పునరుద్ధరించి కార్మిక పిల్లలకు న్యాయం చేయాలని, వచ్చే ఎన్నికల్లో TBGKSను గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని, తెలంగాణ బాగుపడాలంటే మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కేటీఆర్ పేర్కొన్నారు.