BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 April 2026, 08:05 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

శ్రీరాములవారి కల్యాణోత్సవం వేడుకలు పాల్గొన్న శాసనసభ్యులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
05 Apr, 2026 - 08:05 PM
110 వీక్షణలు

సెంట్ సెంట్రల్ నియోజకవర్గంలో శ్రీనగర్ ఒకటో లైన్ లో ఘనంగా శ్రీరాములవారి కల్యాణోత్సవం వేడుకలు పాల్గొన్న శాసనసభ్యులు  బోండా ఉమా

ధి:- 5-4-2026, ఆదివారం సెంట్రల్ నియోజకవర్గంలోని శ్రీనగర్ 1వ లైన్‌ నందు మరియు మధురానగర్ శ్రీరాములవారి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించిన శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ముందుగా శ్రీ సీతారాముల వారి దర్శనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి దైవ ఆశీర్వాదాలు స్వీకరించారు. ఆలయ వేద పండితులు వేదమంత్రాల నడుమ సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించగా, ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.


అనంతరం కొబ్బరికాయ కొట్టి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గారు స్వయంగా భక్తులకు అన్నదానం చేయడం జరిగింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ సమానంగా అన్నదానం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించారు.


ఈ సందర్భంగా బొండా ఉమ  మాట్లాడుతూ:- శ్రీ సీతారాముల కళ్యాణం మన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సౌహార్దత, ధార్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


అదేవిధంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, స్థానిక ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో:- మాజీ కార్పొరేటర్ పిన్నమ్మరాజు త్రిమూర్తి రాజు, సింగం వెంకన్న, కొండా మాలకొండయ్య, గడ్డం శ్రీనివాసరావు మేడసాని చంద్రశేఖర్,దేవరపు మాల్యాద్రి, సింగి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, యువత, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.