BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 21 July 2026, 07:45 pm
Posted by : V శ్రీనివాస్

​సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 Jul, 2026 - 07:45 PM
78 వీక్షణలు

​సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్లలోని గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో డంపర్లు, ఎక్స్‌కవేటర్లు వంటి భారీ యంత్రాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగా బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ (ఓబీ) వెలికితీత మరియు రవాణా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడంతో గనుల్లో పనులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.

​ఈ భారీ వర్షాల వల్ల ఒక్కరోజులోనే దాదాపు 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు సుమారు 1 లక్షా 80 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీతకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంతరాయం సంస్థ మొత్తం ఉత్పత్తి లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత గనుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి, పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించిన అనంతరం మాత్రమే పూర్తి స్థాయిలో కార్యకలాపాలను పునఃప్రారంభిస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు