BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 April 2026, 12:19 pm
Posted by : V శ్రీనివాస్

​సింగరేణి విశ్రాంత ఉద్యోగులకూ రూ. 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 12:19 PM
294 వీక్షణలు

​- మంచిర్యాల జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి

- సింగరేణి అభివృద్ధికి కృషి చేసిన మాకు అండగా నిలవండి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో జరిగిన జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశంలో, సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం దశాబ్దాల పాటు శ్రమించి సంస్థను లాభాల బాటలోకి తెచ్చిన తమకు కూడా రూ. 50 లక్షల ప్రమాద బీమా మరియు రూ. 10 లక్షల సహజ మరణ బీమా సౌకర్యం కల్పించాలని విశ్రాంత ఉద్యోగులు యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. గతంలో సింగరేణి కష్టకాలంలో ఉన్నప్పుడు అహర్నిశలు శ్రమించి నేడు వేల కోట్ల లాభాలు రావడానికి పునాదులు వేసిన తమకు, పదవీ విరమణ తర్వాత చాలీచాలని పెన్షన్‌తో వైద్య ఖర్చులు భరించడం భారంగా మారిందని, అందుకే ప్రస్తుత కార్మికులకు ఇస్తున్న తరహాలోనే బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సింగరేణిలో నూతన బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతికి మరియు ఎస్‌బీఐ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూనే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, నాయకులు గూడ రాజిరెడ్డి, ఎం సత్యనారాయణ, గోపతి లక్ష్మణ్, అడిచర్ల రాజేశం, బాపు తదితరులు పాల్గొన్నారు