BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

​మంచిర్యాలలో సీఐటీయు, రైతు, ప్రజా సంఘాల జిల్లా సదస్సు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jul, 2026 - 05:51 PM
86 వీక్షణలు

​మంచిర్యాలలో సీఐటీయు, రైతు, ప్రజా సంఘాల జిల్లా సదస్సు

  • ఆగష్టు 10న 'జైల్ భరో'ను జయప్రదం చేయాలి: సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి

​మంచిర్యాల పట్టణంలోని పూలే భవనంలో గురువారం సీఐటీయు, రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ గిరిజన సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పైళ్ల ఆశయ్య, రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్ నాయక్ మాట్లాడుతూ.. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని మండిపడ్డారు. పని గంటలు పెంచుతూ కార్మికుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న 'జైల్ భరో'ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

​కేంద్రం చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశాల నుంచి దిగుమతులు పెరిగి దేశీయ పత్తి తదితర వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోయి రైతులు దివాళా తీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఉపాధి హామీ చట్టం పేరు మార్చి నిధుల కోత విధించడం, విద్యుత్ సవరణ బిల్లు ద్వారా స్మార్ట్ మీటర్లు అమర్చి ఉచిత విద్యుత్‌ను రద్దు చేసి వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే కుట్రలను ప్రజలంతా సమైక్యంగా పోరాడి అడ్డుకోవాలని సూచించారు.

​కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆగస్టు 10న జరిగే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సదస్సులో సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్, సహాయ కార్యదర్శులు సాంబారి వెంకటస్వామి, దాగం రాజారాం, కమిటీ సభ్యులు లక్ష్మణ్, రఫియా, దేవదాస్, రవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బోడేంకి చందు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, ఎస్ఎఫ్ఐ కన్వీనర్ శ్రీకాంత్, కేవీపీఎస్ కార్యదర్శి డుర్కే మోహన్, అలాగే బ్రహ్మయ్య, సవిత, జయ, మదునమ్మ, సరిత, రబియా, రామస్వామి తదితరులు పాల్గొన్నారు