BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 July 2026, 05:50 pm
Posted by : V శ్రీనివాస్

​సీసీసీలో వైభవంగా మైసమ్మ తల్లి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న మేయర్ దర్ని మధుకర్

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jul, 2026 - 05:50 PM
202 వీక్షణలు

​సీసీసీలో వైభవంగా మైసమ్మ తల్లి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న మేయర్ దర్ని మధుకర్

మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీసీసీ రాయల్ టాకీస్ వద్ద ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అన్నపూర్ణ సొసైటీ (వార సంత వ్యాపారస్తులు) ఆధ్వర్యంలో శ్రీ మైసమ్మ తల్లి బోనాల జాతర అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా జరిగింది. ఈ పవిత్రమైన వేడుకకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్, టీపీసీసీ సభ్యులు నూకల రమేష్‌లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు, ఆశీర్వాదాలు అందుకున్నారు.

​ఈ సందర్భంగా మేయర్ మధుకర్ జాతర నిర్వాహకులను అభినందిస్తూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాలకు తెలిసేలా ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ జాతరలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డి, అన్నపూర్ణ వారసంత గౌరవ అధ్యక్షులు రాచకొండ వెంకటేశ్వర్ రావు, స్థానిక వ్యాపారస్తులు, అన్నపూర్ణ సొసైటీ సభ్యులు మరియు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు