100 మీటర్లలోపు విక్రయాలు నిషేధం
తెలంగాణ
పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్లలోపు విక్రయాలు నిషేధం: ఎస్సై విష్ణుమూర్తి హెచ్చరిక
NTODAY NEWS: నార్కట్‌పల్లి, నల్గొండ జిల్లా
మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నార్కట్‌పల్లి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సోమవారం నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి ఆధ్వర్యంలో కిరాణా దుకాణాలు, పాన్‌షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయం పూర్తిగా నిషేధమని ఎస్సై స్పష్టం చేశారు. మైనర్లకు సిగరెట్లు, గుట్కా, ఖైనీ తదితర పదార్థాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. పాఠశాలల సమీపంలోని దుకాణదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రమాదాల నివారణకు చౌరస్తాలో జాగ్ బారికేడ్లు
నార్కట్‌పల్లి చౌరస్తాలో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని భారీ వాహనాల నియంత్రణ కోసం జాగ్ బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. సరైన సూచిక బోర్డులు లేకపోవడం, అతివేగం వంటి కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
కొత్తగా ఏర్పాటు చేసిన బారికేడ్లు ప్రమాదాల నివారణకు దోహదపడతాయని, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని కోరారు. ప్రజల సహకారంతో నార్కట్‌పల్లిలో శాంతి భద్రతలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఎస్సై విష్ణుమూర్తి పేర్కొన్నారు.
#Narketpally #TobaccoBan #MinorProtection #SchoolSafety #TrafficControl #NalgondaDistrict #PoliceWarning
Follow us on
Website
Facebook
Instagram
YouTube