BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 18 August 2026, 07:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సనత్‌నగర్‌లో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 07:02 AM
94 వీక్షణలు

సనత్‌నగర్‌లో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

వైద్య సేవల్లో కొత్త అధ్యాయం.. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

కార్డియో, రీనల్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సైన్సెస్ విభాగాల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్‌ఆపరేటివ్ వార్డులు, ట్రామా విభాగం, ఐసీయూ సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చికిత్స కోసం వచ్చే రోగుల నమోదు ప్రక్రియ, రిసెప్షన్‌లో ఏర్పాటు చేసిన టోకెన్ డిస్పెన్సర్ యంత్రం, ఓపీ కౌంటర్ నిర్వహణను పరిశీలించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించిన ముఖ్యమంత్రి.. ఆసుపత్రిలో ఎలాంటి లోపాలు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.