BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 05 March 2026, 08:57 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిలకలూరిపేటలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం

తెలంగాణ
05 Mar, 2026 - 08:57 AM
339 వీక్షణలు
చిలకలూరిపేటలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం NTODAY NEWS: చిలకలూరిపేట ప్రతినిధి రావిపాటి రాజా డ్రైనేజీ పూడికతీత పనులు సగమే.. దుర్వాసనతో ప్రజల అవస్థలు పట్టణంలోని అడ్డ రోడ్డు సెంటర్, సంజీవ్ నగర్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా దెబ్బతింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు పారిశుధ్యంపై సమీక్షలు నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువలో తీసిన వ్యర్థాలు రోడ్డుపైనే సంజీవ్ నగర్ మెయిన్ డ్రైనేజీ కాలువలో పూడికతీత పనులు చేపట్టిన సిబ్బంది ప్లాస్టిక్ వ్యర్థాలు, బురదను తీసి రోడ్డు పక్కనే కుప్పలుగా వదిలేశారు. నాలుగు రోజులు గడిచినా ఆ వ్యర్థాలను అక్కడి నుంచి తరలించకపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనులు సగం చేసి వదిలేయడంతో డ్రైనేజీ శుభ్రత కూడా పూర్తిగా సాధ్యపడలేదని అంటున్నారు. వ్యాపారుల గోడు.. దుర్వాసనతో ఇబ్బందులు డ్రైనేజీ నుంచి తీసిన వ్యర్థాలను రోడ్డుపై కుప్పలుగా వేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ముఖ్యంగా సమీపంలో టిఫిన్ బండ్లు, చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసన కారణంగా కస్టమర్లు రాకపోవడంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలికి ఆ ఎండిన వ్యర్థాలు తిరిగి కాలువల్లో పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఇటీవలే పారిశుధ్యంపై సమీక్ష నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది మాత్రం స్పందించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే డ్రైనేజీ వ్యర్థాలను తొలగించి పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. #Chilakaluripet #SanitationIssue #DrainageProblem #MunicipalNegligence #AndhraPradeshNews #LocalIssues #PublicHealth #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube