BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

షాద్‌నగర్‌లో వివేరా హోటల్‌పై గ్యాంగ్ దాడి కలకలం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 04:08 PM
21 వీక్షణలు

అప్పు వివాదం ముదిరి విధ్వంసం – రూ.4 లక్షల ఆస్తి నష్టం – పరస్పర కేసులు నమోదు

షాద్‌నగర్, జూన్ 3: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కేశంపేట్ ఎక్స్‌రోడ్ సమీపంలో ఉన్న వివేరా హోటల్‌పై జరిగిన గ్యాంగ్ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పు వ్యవహారంలో తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారి హోటల్‌లో భారీ విధ్వంసానికి దారితీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పరస్పరం దాడులు జరగగా, పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.

బాధితుల కథనం ప్రకారం, మధురాపురం గ్రామానికి చెందిన నక్కల శ్రీధర్ గౌడ్ నిర్వహిస్తున్న వివేరా హోటల్‌కు గత నెల 31వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో రఘు చారి తన అనుచరులతో కలిసి వచ్చాడు. నక్కల ప్రశాంత్ గౌడ్ వద్ద నుంచి లక్ష రూపాయల అప్పు తిరిగి తీసుకోవాలనే విషయంపై వాగ్వాదం మొదలై, అది క్రమంగా ఘర్షణకు దారితీసింది.

రఘు చారి వెంట కుడుముల మహేందర్, మనోజ్, శివ, రవి, బీరి, ఫయాజ్‌తో పాటు మరికొందరు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాగ్వాదం అనంతరం వారు ప్రశాంత్ గౌడ్‌పై కర్రలతో దాడి చేసినట్లు, అడ్డుకునేందుకు వచ్చిన శ్రీధర్ గౌడ్‌తో పాటు హోటల్ సిబ్బందిపైనా దాడి జరిగినట్లు ఆరోపించారు.

హోటల్‌లో భారీ విధ్వంసం

దాడి చేసిన వ్యక్తులు హోటల్‌లోని కంప్యూటర్ వ్యవస్థలు, అద్దాలు, ఫర్నిచర్, రెండు ఫ్రిజ్‌లు తదితర సామగ్రిని ధ్వంసం చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా, దాడికి ముందే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ రికార్డు కాకుండా ఉండేందుకు వాటి వైర్లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ ఘటన పథకం ప్రకారమే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మరక్షణలో ప్రతిదాడి

దాడి సమయంలో తనను తాను రక్షించుకునే క్రమంలో ప్రశాంత్ గౌడ్ కర్రతో రవిపై ప్రతిదాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. అనంతరం గ్యాంగ్ మరింత రెచ్చిపోయి హోటల్ మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు.

పోలీసుల సమక్షంలోనూ ఉద్రిక్తత

బాధితులు 100 డయల్‌కు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు బాధితులను రక్షించేందుకు పోలీసు వాహనంలో కూర్చోబెట్టినా, దాడి చేసినవారు వారిని బయటకు లాగి మళ్లీ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పరిస్థితి అదుపుతప్పడంతో మరో ఎస్‌ఐ ప్రవీణ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అక్కడికీ కొందరు వ్యక్తులు వెంబడించి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. అనంతరం ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

కేసులు నమోదు

నక్కల శ్రీధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు షాద్‌నగర్ ఫ్యూచర్ సిటీ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 462/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 118(1), 324(5), 329(3), 352తో పాటు 3(5) ప్రకారం కేసు నమోదు చేశారు. దర్యాప్తును ఎస్‌ఐ ఎల్. రాజేశ్వర్‌కు అప్పగించారు.

అదే సమయంలో జరిగిన పరస్పర దాడుల నేపథ్యంలో నక్కల శ్రీధర్ గౌడ్, ప్రశాంత్ గౌడ్ తదితరులపై కూడా మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం.

రాజకీయ రంగు

ఈ ఘటన అనంతరం రాజకీయ జోక్యం కూడా చోటుచేసుకుందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వివేరా హోటల్ ఒక రాజకీయ నాయకుడికి చెందినదిగా పేర్కొంటూ కొందరు ఈ వివాదానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వివిధ రాజకీయ వర్గాల నాయకులు రాజీ ప్రయత్నాలు చేసినట్లు కూడా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.

ప్రజల్లో ఆందోళన

పట్టణ నడిబొడ్డున, ప్రజలు చూస్తుండగానే జరిగిన ఈ విధ్వంసక ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. యువత గుంపులుగా తిరుగుతూ హింసకు పాల్పడటం ఆందోళనకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బైండోవర్‌లు, రౌడీషీట్లు నమోదు చేయాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

శాంతిభద్రతలకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలపై ఎలాంటి రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.