BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 23 March 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శీలం రమేష్‌కు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:42 PM
218 వీక్షణలు

శీలం రమేష్‌కు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సత్కారం

చండీగఢ్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీలలో రజత పతకం సాధించిన శీలం రమేష్‌ను సోమవారం జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సత్కరించారు. తన కార్యాలయంలో రమేష్‌ను అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు.

దేశంలోని 11 రాష్ట్రాల నుంచి పాల్గొన్న యోగ సాధకులతో పోటీ పడిన రమేష్, విజయవాడ డ్రగ్స్ విభాగానికి చెందిన బీకే రాముడుతో కలిసి ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. హనుమాన్ చాలీసా పాటకు అనుసంధానంగా రిథమిక్ ఫైర్ శైలిలో యోగాసనాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. సుమారు 2 నిమిషాలు 50 సెకన్ల పాటు సాగిన ఈ ప్రదర్శనకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది.

ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రమేష్ ప్రతిభను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యోగా గురువు ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.